Header Banner

కస్టమర్లకు సడెన్ షాకిచ్చిన దిగ్గజ బ్యాంక్! నేటి నుంచే అమలులోకి!

  Tue Feb 25, 2025 08:30        Business

దేశంలోని ఐదో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా సేవలందిస్తున్న ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 24, 2025 నుంచే అమలోకి వచ్చినట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఈ బ్యాంక్ ఇప్పటి వరకు జనరల్ కస్టమర్లకు అత్యధికంగా 7.99 శాతం వడ్డీ ఇస్తుండగా సీనియర్ సిటిజన్లకు 8.49 శాతం మేర వడ్డీ ఆఫర్ చేసేది. ఇప్పుడు ఈ వడ్డీ రేట్లలో కోత పెట్టింది. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష!  

 

వడ్డీ రేట్లు సవరించిన తర్వాత ఇప్పుడు జనరల్ కస్టమర్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. అంటే దాదాపు 24 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గింది. ఇక సీనియర్ సిటిజన్లకు సైతం 24 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గించడంతో కొత్త గరిష్ఠ వడ్డీ రేటు 8.25 శాతానికి పడిపోయింది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే 4 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ అందిస్తోంది. గరిష్ఠ వడ్డీ రేట్లు అనేవి 1 ఏడాది 5 నెలల నుంచి 1 ఏడాది 6 నెలలలోపు ఉండే డిపాజిట్లపై కల్పిస్తోంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇండస్ ఇండ్ బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు..
- 7 రోజుల నుంచి 30 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3.50శాతం వడ్డీ ఇస్తోంది.
- 31 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీ ఇస్తోంది.
- 46 రోజుల నుంచి 120 రోజుల వరకు ఉండే వివిధ టెన్యూర్ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ అందిస్తోంది.
- 121 రోజుల నుంచి 180 రోజుల కాల పరిమితి డిపాజిట్లపై 5.85 శాతం వడ్డీ ఇస్తోంది.
- 211 రోజుల నుంచి 269 రోజులకు 6.10 శాతం, 270 రోజుల నుంచి 354 రోజులకు 6.35 శాతం వడ్డీ ఇస్తోంది.
- 355 రోజుల నుంచి 364 రోజుల వరకు 6.50 శాతం వడ్డీ అందిస్తోంది.
- 1 ఏడాది నుంచి 1 ఏడాది 3 నెలలు, 1 ఏడాది 3 నెలల నుంచి 1 ఏడాది 4 నెలలు, 1 ఏడాది 4 నెలల నుంచి 1 ఏడాది 5 నెలలు, 1 ఏడాది 5 నెలల నుంచి 1 ఏడాది 6 నెలలు, 1 ఏడాది 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉండే డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ ఇస్తోంది.
- 2 సంవత్సరాల నుంచి 61 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందిస్తోంది.
- 61 నెలలు ఆపైన డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఇస్తోంది.
- ఇక 5 సంవత్సరాల ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది.
- ఆయా టెన్యూర్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Banks #FDs #Interest